నిట్ వరంగల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | NIT Warangal Visiting Faculty Recruitment 2023 Check eligibility and Apply here..
జాతీయ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT) వరంగల్ శుభవార్త!
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వివిధ సబ్జెక్టుల్లో/ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తేదీ:10.08.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం సంబంధిత దరఖాస్తు ఫారంతో అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి ఈ నెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
విభాగాలు:
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
- మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
- హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్,
- స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్,
- మ్యాథమెటిక్స్,
- ఫిజిక్స్..
పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- ప్రొఫెసర్..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 60 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, బిఈ, ఎంఈ, ఏంటెక్, ఎంఎస్, ఎంఎస్సి, పిజి, ఎమ్ఎ, పిహెచ్డి, బీ.ఈడీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 10.08.2023 నాటికి40 - 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 40 సంవత్సరాలకు మించకుండా,
- అసోసియేట్ ప్రొఫెసర్లకు 45 సంవత్సరాలకు మించకుండా,
- ప్రొఫెసర్లకు 50 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.
- ప్రొఫెసర్ లకు రూ.1,00,000/-,
- అసోసియేట్ ప్రొఫెసర్ లకు రూ.80,000/-,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు రూ.70,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు,
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- 20.08.2023 ఉదయం 9:00 నుండి 11:00 గంటలు వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment