JOB MELA 2022 | ఈనెల 12న 10,000+ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా. రిజిస్టర్ అవ్వండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! అధ్యగోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్.మోహన్ గోలి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నవంబర్ 12వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళా లో ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగాలకు చెందిన సుమారు 180+ మల్టీనేషనల్ కంపెనీలు 10,000+ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ మేళాలో పాల్గొంటున్నట్లు డాక్టర్.మోహన్ గోలి నిరుద్యోగ యువతకు పోస్టర్ విడుదల చేస్తూ.. ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు. చిన్నతనంలో చాలా కష్టపడి, అమెరికాలో 20 సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో స్థిరపడిన అధ్య గోలి ఫౌండేషన్ చైర్ పర్సన్ తన సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా 40 దేశాల్లో తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారూ తాను జన్మించిన జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ రహిత జిల్లాగా మార్చడానికి ఈ ఉద్యోగమేలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో యువత ఉన్నత చదువులు చదివి, సరైన ఉద్యోగ అవకాశాలు లేక