Group-IV New Vacancies 2023 | గ్రూప్-4 లో 141 కొత్త పోస్టులు | Apply Online here..
గ్రూప్-4 లో 141 కొత్త పోస్టులు | Apply Online here.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నియామకాలను వేగవంతం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2,391 ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు 27.01.2023 న ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.. సంబంధిత విధి విధానాలతో త్వరలో నియామక ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 8039 పోస్టులు కాగా.. నూట నలభై ఒక్క కొత్త పోస్టుల చేరికతో.. ఆ సంఖ్య 8,180 కు చేరుకుంది. ఈ పెరిగిన 141 పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అర్హులు. బీసీ గురుకుల లో జూనియర్ అసిస్టెంట్(బాయ్స్ మరియు గర్ల్స్) సంస్థల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ కోడ్ 11 గా ఉన్నటువంటి ఈ విభాగంలో 289 పోస్టులు ఉన్నాయి తాజాగా కలిగినటువంటి 141 పోస్టులతో ఆ సంఖ్య 430 కు చేరింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దర...