MPHW (F)/ ANM Training Admission 2023-25 తెలంగాణ మహిళలకు ఎంపీహెచ్డబ్ల్యు (ఎఫ్)/ ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..
మహిళలకు శుభవార్త! ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషన్ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రం, CH&FW TS, 2023-24 విద్యా సంవత్సరానికి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్)/ ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని మహిళా అభ్యర్థులు ఈ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈనెల 20వ తేదీ నాటికి సమర్పించాలి. ఈ కోర్సులు రెండు సంవత్సరాల వ్యవధితో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు (5) ప్రభుత్వ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో మొత్తం 180 సీట్లు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లలో 840 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1020 సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! , అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో మేనేజ్మెంట్ సీట్లు అందుబాటులో లేవు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో 40% మేనేజ్మెంట్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ. తెలంగాణ మహిళలకు ఎంపీహెచ్డబ్ల్యు (ఎఫ్)/ ఏఎన్ఎం ట్రైనింగ్...