డిగ్రీతో గ్రామీణ బ్యాంకుల్లో 8,612 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే.. IBPS Recruitment 2023 | Apply Online here.
భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త! IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 8,612 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మొత్తం 43 బ్యాంకులు పాటిస్పేట్ చేస్తున్నాయి. వివరణ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన మహిళా, పురుష భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 8,612 . విభాగాల వారీగా ఖాళీలు: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) - 5,538, ఆఫీసర్ (స్కేల్ -1) - 2,485, ఆఫీసర్ (స్కేల్ -2) - 516, ఆఫీసర్ (స్కేల్ -3) - 73. ఈ పై ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 01, 2023 నుండి జూన్ 21, 2023 మధ్య సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు.. భారతీయ అభ్యర్థులు అర్హులు, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సిఎ అర్హ...