డిగ్రీతో గ్రామీణ బ్యాంకుల్లో 8,612 పోస్టుల భర్తీకి భారీ ఉద్యోగ ప్రకటన. వివరాలివే.. IBPS Recruitment 2023 | Apply Online here.
భారతీయ గ్రాడ్యుయేట్లకు శుభవార్త!
IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 8,612 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మొత్తం 43 బ్యాంకులు పాటిస్పేట్ చేస్తున్నాయి. వివరణ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన మహిళా, పురుష భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య : 8,612.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) - 5,538,
- ఆఫీసర్ (స్కేల్ -1) - 2,485,
- ఆఫీసర్ (స్కేల్ -2) - 516,
- ఆఫీసర్ (స్కేల్ -3) - 73.
ఈ పై ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూన్ 01, 2023 నుండి జూన్ 21, 2023 మధ్య సమర్పించవచ్చు.
- ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు..
- భారతీయ అభ్యర్థులు అర్హులు,
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సిఎ అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- జూన్ 01, 2023 నాటికి 18-40 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం వయో-పరిమితిలో సడలింపు లు వర్తిస్తాయి. అవి;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..
ఎంపిక విధానం:
- ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు ₹.850/-
- రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.
- ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:
- చీరాల,
- చిత్తూర్,
- గుంటూరు,
- కడప,
- కాకినాడ,
- కర్నూల్,
- నెల్లూరు,
- ఒంగోల్,
- రాజమండ్రి,
- శ్రీకాకుళం,
- తిరుపతి,
- విజయవాడ,
- విశాఖపట్నం,
- విజయనగరం.. మొదలగునవి.
తెలంగాణ - పరీక్ష సెంటర్లు:
- హైదరాబాద్,
- కరీంనగర్,
- ఖమ్మం,
- వరంగల్.. మొదలగునవి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.06.2023 నుండి,
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.06.2023.
- ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment