TGTWR COE CET 2025 ఉచిత కార్పొరేట్ స్థాయి జూనియర్ ఇంటర్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం Inter Admissions Register here..

కార్పొరేట్ స్థాయి ఇంటర్ ప్రవేశ అవకాశాలు: 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న & March 2025 లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న షెడ్యూల్ ట్రైబ్ (ST) విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల 2025-2026 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జూనియర్ ఇంటర్మీడియట్ 14 కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ (COEs) కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2024-25) లో 10 తరగతి చదువుతున్న & March 2025 లో పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న షెడ్యూల్ ట్రైబ్ (ST) విద్యార్థిని, విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఈ ఉచిత కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి TGTWR COE CET 2025 ఉమ్మడి ప్రవేశ పరీక్షకు చేసుకోండి. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్య వసతి తో పాటు JEE MAINS/ ADVANCED/ NEET/EAMCET మొదలగు పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ లను కూడా ఉచితంగా ఇప్పిస్తుంది. పూర్తి సమాచారం, విద్యార్హత, వయస్సు, అందుబాటులో ఉన్న ఇంటర్మీడియట్ గ్రూప్...