ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ. నియామకాల విధానం ఇక్కడ.

నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల ఆలస్యం కావడంతో TGSRTC లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి రెండు నెలల క్రితం 1000 మంది డ్రైవర్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరించి నియామకాలను చేపట్టింది. శిక్షణ పూర్తయిన వారు డ్రైవర్లుగా నియామక పత్రం పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ రీజియన్ల పరిధిలో 800 కండక్టర్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆయా రీజియన్లలో దరఖాస్తు చేసుకోవాలి. 📌పూర్తి నియామక తక్రియతో నోటిఫికేషన్ త్వరలో జారికానుంది. ప్రస్తుతం TGSRTC లో 2000 మంది కండక్టర్లు అవసరం ఉన్నది. దాదాపుగా రెగ్యులర్ విధానంలో 500 మంది వరకు కండక్టర్లు ఆర్టీసీ కార్గో సర్వీస్, పెట్రోల్ బంక్ ఇతర అనుబంధ సంస్థల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కండక్టర్ల ఉద్యోగ విరమణ తో కొరత ఏర్పడింది. డ్రైవర్, కండక్టర్, డిపో మేనేజర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 4000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి...