International Yoga day 2021 || జూన్ 21వ తేదీ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.
🧘♂️ జూన్ 21వ తేదీ రోజునే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నారో తెలుసా.?🧘♂️ 🙏 జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవం. 2015వ సంవత్సరం నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ఉన్న ప్రజలు ఈ రోజున యోగా డేలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈ సారి కూడా దీన్ని అట్టహాసంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ తారలు, వాళ్లు, వీళ్లు అని తేడా లేకుండా జనాలందరూ యోగా డేలో పాల్గొని తమకు వచ్చిన యోగాసనాలు వేశారు. అయితే మీకు తెలుసా..? జూన్ 21వ తేదీనే యోగా డేగా ఎందుకు నిర్ణయించారో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాదిలో ఉండే 365 రోజుల్లోనూ జూన్ 21వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… ఈ రోజున సహజంగానే పగటి సమయం ఎక్కువ. ఎందుకంటే , ఇదే రోజున దక్షిణాయనం ప్రవేశిస్తుంది. మరియు ఇదే రోజున శివుడు (ఆదిగురువు, ఆది యోగి) యోగా గురించిన విజ్ఞానాన్ని దేవతలకు వివరించాడట!. అందుకే ఈ రోజు నుండి యోగాతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా అ...