TSPSC R&B Recruitment 2023 | రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం | Check Details here..
రోడ్లు మరియు భవనాల శాఖ లో 472 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది కొద్దిరోజుల క్రితమే తాజాగా గ్రూప్-1, 2, 3, 4 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే జుడిషియల్ పోర్టుల్లో ఖాళీగా ఉన్న 6 విభాగాల్లో 1,904 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్ జారీ అయింది. టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావలసి ఉన్నది.. రాష్ట్ర ప్రభుత్వం లోని డి.ఎడ్ బి.ఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 05.01.2024 న ఆర్థిక శాఖ అనుమతి తో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రోడ్లు మరియు భవనాల శాఖలో 472 ఖాళీలకు అనుమతి తెలుపుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో మొత్తం ఇరవై ఒక్క విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో పూర్తి వివరాలతో నియామక నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ముందస్తు ప్రణాళికలతో ఉద్యోగ అవకాశాలను చేజిక్కి