Pan Aadhaar Link || పాన్ ఆధార్ లింక్ డెడ్లైన్ ఇదే.. క్షణాల్లో లింక్ చేయండిలా...
పాన్ కార్డ్ వినియోగదారులందరూ కచ్చితంగా పాను నెంబర్ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లుబాటు ఆగిపోతుంది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ మార్చి 31 ను చివరి గడువు గా ప్రకటించింది. మీరు పాన్ కార్డును కలిగి ఉన్నారా? కలిగి ఉంటే మీరు కచ్చితంగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ ప్రకటించిన గడువులోపు పాన్ నో ఆధార్ తో లింక్ చేసుకోకపోతే రూ.1000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే బ్యాంకు లు తమ కస్టమర్లకు తెలియజేశాయి. జూన్ 1 నుండి ఆదాయ పన్ను శాఖ, మెరుగైన సేవలు అందించడానికి తనను తాను అప్డేట్ చేసుకుని, వినియోగదారులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండే యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ ను ప్రారంభించిన క్రమంలో 7 రోజుల పాటు అన్ని రకాల సేవలను నిలిపివేసింది. ఇప్పుడు వినియోగదారులు కొత్త పోర్టల్ ను సందర్శించి, తెలుసుగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగిస్తుంది. అంటే ఇప్పటివరకూ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకునేవారు ఈ నెలలోనే తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ చెల్లుబాటు నిలిచి