వాలంటీర్ ఉద్యోగాలు: గ్రామీణ యువతకు తెలంగాణ ప్రభుత్వం ఆఫర్. పంటల డిజిటల్ సర్వేకు వాలంటీర్లు నియామకం. వివరాలు..
వాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పంటల డిజిటల్ సర్వే నిర్వహించాలనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తెలంగాణ యాసంగి పంట డిజిటల్ సర్వేను సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయాలని భావిస్తుంది. ఈ పంటల సర్వే పూర్తి చేయడానికి ప్రైవేట్ సర్వేయర్లను తాత్కాలికంగా నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,621 గ్రామాలు ఉన్నాయి, అందులో 194.69 లక్షల సర్వే నెంబర్లు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో 9,795 గ్రామాలకు సంబంధించి విజిలెన్స్ యాప్ అందుబాటులో ఉన్నాయి.174.36 లక్షల భూముల సర్వే నెంబర్లకు సంబంధించిన బాధ్యతలు ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్ల ద్వారా సర్వే చేయడానికి నియమించనున్నారు. మిగిలి ఉన్న 826 గ్రామాల్లోని పోడు భూముల సర్వేను వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) సర్వే చేస్తారు. ఈ వాలంటీర్ల నియామకం కోసం ప్రతి గ్రామంలో స్థానికుడిని వాలంటీర్ గా ఎంపిక చేస్తారు. రోజుకు కనీసం వాడు 150 నుండి 200 సర్వే నెంబర్లకు సంబంధించిన ఫోటోలు తీసి మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫోటోకు ₹7 చొప్పున వారికి ఇవ్వనున్నట్లు అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేలకు సంబంధించి ₹30.42 కోట్లు కేటాయించింది. అయితే వానాకాలం సీజన్ సర్వేకు ఇప్పటివరకు ₹2.93 కోట్లు ఖర్చు అయినాయి. మిగిలిన నిధులు యాసంగి సర్వే పూర్తి చేయడానికి వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వ సలహాదారు జీవన్ చావ్లా రాష్ట్ర వ్యవసాయ అధికారులతో సమావేశమై గడువులోగా పూర్తి చేయించండి అని స్పష్టం చేశారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
పంటల డిజిటల్ సర్వే చేయడానికి ఎవరు అర్హులు:
- స్థానిక గ్రామ అభ్యర్థి అయి ఉండాలి.
- కనీసం పదో తరగతి అర్హత అవసరం.
- పీజీ వరకు చదివి ఉన్నవారు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కిల్స్ కలిగి ఉండాలి:
- మొబైల్ యాప్ వినియోగంపై అవగాహన.
- ఫోటో అప్లోడ్,
- ఫోటో టేకింగ్,
- డాక్యుమెంటేషన్ సబ్మిషన్ అవసరం.
దరఖాస్తు విధానం త్వరలో ప్రారంభం కానుంది.
- పూర్తి వివరాల కోసం మీ స్థానిక వ్యవసాయ అధికారి గారిని సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment