ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్ ప్రతి నెల ఇలా పొందండి..
ఇంటర్నెట్ షిప్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ 2026 ప్రారంభమైంది. యువత వివిధ రంగాల్లో ఇంటర్న్షిప్ ద్వారా అనుభవం పొందడం కోసం, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అభ్యర్థులు "ప్రథమ" టాప్దే-500 కంపెనీల్లో ప్రత్యక్షంగా పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇంటర్న్షిప్ పూర్తిచేసిన అభ్యర్థులకు అనుభవం సర్టిఫికెట్ లభిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు విడతల్లో ఈ ఇంటర్న్షిప్ పథకం అమలు చేయగా మూడో విడతలో మొత్తం 17,121 అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాల కోసం అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలని పరిశ్రమల శాఖ డైరెక్టర్ జే. నిఖిల్ చక్రవర్తి గారు ఒక ప్రకటనలో తెలిపే తెలిపారు. ఇప్పటికే పీఎంఐఎస్ వెబ్సైట్ ద్వారా అనేక కంపెనీలు ఇంటర్న్షిప్ (అవకాశాలు) కార్యక్రమాలను అందిస్తున్నాయి. పీఎంఐఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.9000/- స్కాలర్షిప్, అలాగే ఏక మొత్తంలో ఒకేసారి రూ.6000/- ఆర్థిక సహాయంతో పాటు ఇంటర్న్షిప్ పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. 18 సంవత్సరాలు...

















