నిరుద్యోగులకు శుభవార్త! 249 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF - 249 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ నెల 31 వరకు (31.03.2022) దరఖాస్తులు చేయవచ్చు. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 241, విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, జూడో, కబ్బడి, షూటింగ్, సిమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్, టైక్వాండో.. మొదలగునవి. పురుషుల విభాగంలో ఖాళీలు: 181. మహిళా విభాగంలో ఖాళీలు: 68. అర్హత ప్రమాణాలు: నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లో పాల్గొని ఉండాలి. మరియు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: ఆగస్ట్ 1, 2021 నాటికి 18 నుండి 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST),