NCSC Hyderabad JOB Fair 2022 | హైదరాబాద్ వేదికగా 200 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూ.. రిజిస్టర్ అవ్వండిలా..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh88DcNhQk84w7hBjxNhaMqgH_OAtXFlgfpajeMh77IlX3IruhPAXeBq_y_pQ8Yg1tKv8vWt4k45jJ-JwDa7Z3cd4Qs8hjxA7byw2yHpck7t8iYF-bwq33maFPQmILm258-nwNdEdHJXIFGyMwpj-jMqBmgUeDPsWk_D64O3LzsaJe2KI4dfX3CbQWq/s320/NCS%20JOB%20Vacancies%202022%20by%20elearningbadi.in.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి అనుభవం లేకుండా.. 10వ, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్(NCSC) ఉద్యోగాల భర్తీకి రేపు 24.11.2022 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు, అధికారిక నేషనల్ కెరియర్ సర్వీస్(NCS) పోర్టల్ ద్వారా అభ్యర్థులకు ప్రకటనను విడుదల చేస్తూ, రిజిస్ట్రేషన్ లింకును అందుబాటులో ఉంచింది . ఈ ఉద్యోగ డ్రైవ్ లో నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ నుండి ఈరోజు రాత్రి 12:00 గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్ పూర్తి విధానం ఇక్కడ. తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఖాళీల వివరాలు: 200. పాల్గొంటున్న కంపెనీల సంఖ్య : 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. నిర్వహిస్తున్న సంస్థ : నేషనల్ కెరియర్, హైదరాబాద్, తెలంగాణ.