TS Music and Dance College Admissions 2021 || సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలు.. పూర్తి వివరాలివే..
తె లంగాణ భాషా సాంస్కృతిక శాఖ - 2021- 22 విద్యా సంవత్సరానికి సంగీత, నృత్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంగీతం, మృత్య కళాశాలల్లో ప్రవేశాలకు 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు, 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు లో జాయిన్ అయిన వారికి ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ సంగీత కళాశాలల వివరాలు: 1. శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - గుడిమల్కాపూర్ హైదరాబాద్. 2. శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - సికింద్రాబాద్. 3. శ్రీ త్యాగరాజు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - రామ్ కోటి హైదరాబాద్. 4. ఆంధ్ర మహిళా సభ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల - హైదరాబాద్. 5. శ్రీ విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - వరంగల్. 6. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - మంథని. 7. శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - నిజామాబాద్. విభాగాలు: 1. కర్ణాటక గాత్రం, 2. హిందూస్థానీ గాత్రం, 3. పేరిణి నృత్యం, 4. కూచిపూడి నృత్యం, 5. భరత నాట్యం, 6. కథక్, 7. కర్ణాటక వయోలిన్, 8. తబలా, 9. సితార్,