TS Music and Dance College Admissions 2021 || సంగీత నృత్య కళాశాలలో ప్రవేశాలు.. పూర్తి వివరాలివే..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ - 2021- 22 విద్యా సంవత్సరానికి సంగీత, నృత్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంగీతం, మృత్య కళాశాలల్లో ప్రవేశాలకు 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు, 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సు లో జాయిన్ అయిన వారికి ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
తెలంగాణలోని వివిధ సంగీత కళాశాలల వివరాలు:
1. శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - గుడిమల్కాపూర్ హైదరాబాద్.
2. శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - సికింద్రాబాద్.
3. శ్రీ త్యాగరాజు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - రామ్ కోటి హైదరాబాద్.
4. ఆంధ్ర మహిళా సభ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల - హైదరాబాద్.
5. శ్రీ విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - వరంగల్.
6. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - మంథని.
7. శ్రీ జ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - నిజామాబాద్.
విభాగాలు:
1. కర్ణాటక గాత్రం,
2. హిందూస్థానీ గాత్రం,
3. పేరిణి నృత్యం,
4. కూచిపూడి నృత్యం,
5. భరత నాట్యం,
6. కథక్,
7. కర్ణాటక వయోలిన్,
8. తబలా,
9. సితార్, మృదంగం, వీణ, నాదస్వరం, డోలు, ఫ్లూట్.. మొదలగునవి.
అర్హత:
★10 సంవత్సరాల , వయస్సు పూర్తి చేసుకున్న వారు.. ఈ సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
★ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులై సంగీతం, నాట్యం మొదలగు వాటిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
★ డిప్లమా కొరకు సంబంధిత సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ముఖ్య సమాచారం:
★ కోర్టు ఫీజు:
1. సర్టిఫికెట్ కోర్సుకు సంవత్సరానికి ఫీజు రూ. 1100/-.
2. డిప్లమా కోర్సుకు సంవత్సరానికి ఫీజు రూ.1500/-.
★ దరఖాస్తు ఫీజు రూ.25/-.
★ కళాశాల పని వేళలు: మ౹౹ 2.00 నుండి సా౹౹ 7.00 వరకు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.07.2021.
రూ.20/- లేట్ ఫీ తో: 30.08.2021.
రూ.50/- లేట్ ఫీ తో: 15.09.2021.
దరఖాస్తుకు జత చేయవలసిన పత్రాలు:
1. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు,
2. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్/ ఎస్ ఎస్ సి మెమో జిరాక్స్,
3. ఆధార్ కార్డు జిరాక్స్
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్:
2. అధికారిక వెబ్ సైట్ లో కనిపిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 2021 పై క్లిక్ చేయండి.
3. ఆన్లైన్ గూగుల్ డాక్యుమెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి, పేరు, కాంటాక్ట్ నెంబర్.. మొదలగు వివరాలను పూర్తి చేస్తూ, డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
4. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి, మూడు పని దినాలలో దరఖాస్తులో పేర్కొన్న ఈమెకు కాలేజ్ నుండి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి పేమెంట్ ఫీ సమాచారం వస్తుంది.
5. మరే ఇతర విషయాలపై నా ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. +91 - 9703240329, +91 - 40 - 23523850.
అధికారిక వెబ్సైట్: http://sbrgcmd.com/ http://sancgcmd.com/
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్:శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - సికింద్రాబాద్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdf1Po1u5L0BQxnB64mh6_qR8VL4iuU4Be7nyf6BR5ZaKiY_Q/viewform
దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్:శ్రీ అన్నమాచార్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల - గుడిమల్కాపూర్ హైదరాబాద్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfhykUV54-Fg32g8z9qmyExuM1ye7yN5mD79zCQRTg1EzVkkg/viewform
దరఖాస్తు ఫామ్:
అధికారిక నోటిఫికేషన్:
📢 for Employment News Click here
Comments
Post a Comment