Schedule of Telangana Common Entrance TESTs-2021 Dates out. Get details Here..
తేది.21.6.2021 పత్రిక ప్రకటన రాష్ట్రంలో ఎమ్సెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్ సెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎమ్ సెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం నాడు తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్సు ల్తానియా, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వ