పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | SSK Walk-In-Interview for Part Time Teachers | Check Date Time & Venue here..
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బి.ఈడి అర్హత కలిగి పార్ట్-టైం-టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా లోని సైనిక్ స్కూల్ కలికిరి.. వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు ఈనెల 30.08.2023 న ఉదయం 08:45 నుండి 11:15 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ సెషన్ లో భాగస్వాములు కావచ్చు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగువన. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 02 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : పిజిటి కంప్యూటర్ సైన్స్ - 01, టీజీటీ సోషల్ సైన్స్ - 01.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హతను కంప్యూటర్ సైన్స్ విభాగంలో. అలాగే డిగ్రీ తో బి.ఈడి అర్హత కలిగి ఉండాలి. అలాగే TS-TET/ AP-TET/ C-TET/ SET అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి