పార్ట్ టైం టీచర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | SSK Walk-In-Interview for Part Time Teachers | Check Date Time & Venue here..
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో బి.ఈడి అర్హత కలిగి పార్ట్-టైం-టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా లోని సైనిక్ స్కూల్ కలికిరి.. వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలు నిర్వహించే నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల యువత ఈ ఉద్యోగాలకు ఈనెల 30.08.2023 న ఉదయం 08:45 నుండి 11:15 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ సెషన్ లో భాగస్వాములు కావచ్చు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగువన.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
- పిజిటి కంప్యూటర్ సైన్స్ - 01,
- టీజీటీ సోషల్ సైన్స్ - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్/ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ అర్హతను కంప్యూటర్ సైన్స్ విభాగంలో.
- అలాగే డిగ్రీ తో బి.ఈడి అర్హత కలిగి ఉండాలి.
- అలాగే TS-TET/ AP-TET/ C-TET/ SET అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- తేదీ 29.08.2023 నాటికి 21 - 40 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం:
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సబ్జెక్టులను అనుసరించి రూ.58,819/- నుండి రూ.69,356/- వరకు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- వేదిక : సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా.
- సమయం : ఉదయం 08:45 నుండి 11:15 వరకు.
- తేదీ : 30.08.2023.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో బయోడేటా ఫామ్ రెడీ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://sskal.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment