NEET UG 2021 Exam Guidelines 2021 | NTA guidelines Dress code, Barred items and more details read here..
నేడు నీట్.. ఏర్పాట్లన్నీ పూర్తి 💧 హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ 💧 చెవిపోగులు, చైన్లు, ఇతర ఆభరణాలు పెట్టుకోవద్దని ఎన్టీఏ నిబంధన వైద్య విద్య కోర్సు(యూజీ)ల్లో ప్రవేశా లకు సంబంధించి నీట్-21కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆది వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల మంది విద్యా ర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో పరీక్షా కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎసీఏ) కేటాయించింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది 4 శాతం మంది విద్యార్థులు 'నీట్'కు హాజరు కాగా... ప్రస్తుతం హాజరు శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం జరిగే నీట్ కు ఎన్టీఏ కఠిన నిబంధనలు విధించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. అలాగే అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. నిబంధనలివే.. 💧 నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులే ధరించాలి. అబ్బాయిలైనా,