హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత ఉద్యోగాలు | IIT Hyderabad Regular Posts 2023 | Check Vacancies, Salary, Online Application here..
తెలంగాణ, హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ(IITH) శాశ్వత ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఈ దిగువ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. మహిళా/ పురుష/ దివ్యాంగులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు తేదీ నాటికి వయస్సు 35 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు. Pay Kevel (3 - 10) ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో (బ్యాచ్లర్/ టెక్నికల్) గ్రాడ్యుయేట్లు అవసరం. 04.03.2023 వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఆన్లైన్ దరఖాస్తులకు 03.04.2023 ఆఖరి గడువు గా నిర్ణయించబడింది. పూర్తి ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ సమగ్ర సమాచారం మీకోసం ఇక్కడ. ఈ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ ప్రకటనలు కూడా చదవండి. మీకు తెలుసా? తెలియకపోతే వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. 📌 తెనాలి కేంద్రీయ విద్యాలయం :: టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 📌 విశ్వ భారతి విద్యా సంస్థలు :: టీచర్ ఉద్యోగాలకు ఈనెల ఈనెల 25 & 26 న ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.