Indian Railway Jobs 2023: SECR 772 Vacancies Recruitment 2023 | సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో రాత పరీక్ష లేకుండా 722 ఉద్యోగాలు.
భారతీయ రైల్వే 10వతరగతి, ఐటిఐ తో 2023-24 సంవత్సరానికి 722 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాతపరీక్ష లేకుండా! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 08.06.2023 నుండి 07.07.2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ నాగపూర్ డివిజన్ ఆఫీస్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను 06.06.2023 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను జూలై 07, 2023 రాత్రి 11:59 వరకు సమర్పించవచ్చు. ఈ నియామకాలను Apprentices Act -1961 మరియు Rules -1962 ప్రకారం నిర్వహిస్తున్నారు. ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, COPA (కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్), ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)/ సెక్రటేరియల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ (హిందీ)...