నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఈనెల 20 లోపు దరఖాస్తులు చేయండి. Telangana Skill Development for Nurses Free Training Recruitment 2023..
నిరుద్యోగ యువతకు శుభవార్త! తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిహెచ్ సైదులు, నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20 లోపు దరఖాస్తులు చేసుకోవాలని యువతకు సూచనలు చేశారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కోర్సుల వివరాలు: జనరల్ డ్యూటీ, అసిస్టెంట్ ఎమర్జెన్సీ, మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ట్రైనింగ్.. మొదలగునవి. కోర్సు వ్యవధి :: మూడు నెలలు. విద్యార్హత : 10వ తరగతి ఆపై అర్హతలు కలిగిన వారు అర్హులు. వయోపరిమితి: ప్రవేశ తేదీ నాటికి 18 నుండి 35 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. రిజిస్ట్రేషన్ నమోదుకు చివరి తేదీ :: 20.08.2023 . సందేహాలను నివృత్తి కోసం ఈ 9848581100, 9059902355 నెంబర్లను సంప్రదించండి. 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Wo