అంగన్వాడి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మెరిట్ జాబితా విడుదల | WDCW EO Merit List 2022 Declared | Download Result Sheet here..
WDCW EO Merit List 2022 Declared | Download Result here.. అంగన్వాడీ 181 సూపర్వైజర్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన. తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్ గ్రేడ్-1) పోస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు/ సెప్టెంబర్ 2022న ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, హాల్టికెట్లను విడుదల చేసి 08.01.2023 పరీక్షలను నిర్వహించింది. మహిళా అభ్యర్థులు ఫలితాలకోసం ఎదురు చూస్తున్న తరుణంలో 03.03.2023 న మెరిట్ జాబితా ను విడుదల చేస్తూ అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థులు మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్ సైట్ ను (లేదా) దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టిఎస్పిఎస్సి వెల్లడించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి టి ఎస్ పి ఎస్ సి జనవరి 8న, 2023 న పరీక్ష నిర్వహించ