టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ NIT AP Faculty Recruitment for 24 Various Posts Apply here..

ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ నోటిఫికేషన్ విడుదల.. భారతీయ అభ్యర్థులు ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు హార్డ్ కాపీలను సైతం సమర్పించాలి. షార్ట్ లిస్టు చేయబడిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన ఇంటిమేషన్ ఈమెయిల్/ మొబైల్ నెంబర్ కు తెలియపరచడం జరగదు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి. షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా అధికారిక వెబ్సైట్ నందు ప్రకటించబడుతుంది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సబ్జెక్టుల వారీగా, వర్గాల వారీగా.. పోస్టుల వివరాలు ఇక్కడ. ఎంపికైన అభ్యర్థులకు గ్రూప్ ఏ, లెవల్-10, 7th CPC ప్రకారం ప్రారంభ బేసిక్-పే రూ.70,900/- ప్రతినెల అన్న...