టీచర్ ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు: KVS Uppal Hyderabad Walk-In-Interview for Teaching Staff 2023..
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం నెంబర్.1 ఉప్పల్, వివిధ టీచింగ్ సబ్జెక్టు లలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు రేపు ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం హైదరాబాద్ నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. కేంద్రీయ విద్యాలయం ఉప్పల్, హైదరాబాద్, వాకింగ్ ఇంటర్వ్యూ టీచర్ ఉద్యోగ నియామకాలు: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ కేంద్రీయ విద్యాలయం నెంబర్-1 ఉప్పల్ హైదరాబాద్. పోస్టులు PGT, TGT, PRT. ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వేతనం/ పే స్కేల్ రూ.21,250 - 27,500/-. పోస్టింగ్ ప్రదేశం కేంద్రీయ విద్యాలయం ఉప్పల్, హైదరాబాద్. ఇంటర్వ్యూ తేదీ 16.10.2023 అధికారిక వెబ్సైట్ https://no1uppal.kvs.ac.in/ పోస్టుల వివరాలు