ICAR Assistants Recruitment 2022 | Graduates Can Apply 462 Vacancies of ICAR Assistants | Check Selection process and Other Details here @elearningbadi.in/
నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం డిగ్రీ అర్హతతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్తో సహా 92 వ్యవసాయ ప్రాంతీయ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 462 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను ఐకార్ - భారత వ్యవసాయ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్1, 2022 గా నిర్ణయించారు. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 462 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఐకార్ హెడ్ క్వార్టర్స్ లో - 71. ◆ ఐ కార్ ప్రాంతీయ సంస్థలలో - 391.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ విద్యార్హత కలిగి ఉండాలి. వయసు: జూన్ 1, 2022 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. రాత పరీక్ష ప్రిలిమినరీ మెయిల్స్ రూపంలో నిర్వహిస్తారు