తెలంగాణ జిల్లా సొసైటీ సెంటర్లలో ఉద్యోగాలు, జిల్లాల వారీగా ఖాళీలు ఇవే..TSACS MOs ARTC Recruitment Notification 2023. Apply here.
తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతినెల రూ.72,000/- వేతనంతో.. మెడికల్ ఆఫీసర్ల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలిగితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరిచారు. అభ్యర్థులు దిగువ సూచించిన వివరాల ఆధారంగా, లేదా అధికారిక నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, నోటిఫికేషన్ వివరాలను తనిఖీ చేసి, తదుపరి దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య : 20. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: హైదరాబాద్ - 04, కరీంనగర్ - 06, ఖమ్మం - 01, మహబూబ్నగర్ - 02, మెదక్ - 02, నల్లగొండ - 01, నిజామాబాద్ - 02, వరంగల్ - 02.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, తప్పనిసరిగా MBBS అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం....