EPFO UAN || EPFO link aadhaar || ఆధార్ లింక్ తో మారిన పిఎఫ్ రూల్స్ .. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఇపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పులు జూన్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని ఈపీఎఫ్ఓ ఖాతా లకు ఆధార్ కార్డ్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సంస్థలకు ఆదేశాలను పంపించింది. ఆధార్ కార్డు తో అనుసంధానించండి ఖాతాలకు ఈసిఆర్ దాఖలు చేయలేరు కాబట్టి సంస్థ కాంట్రిబ్యూషన్ నిలిచిపోతుందని తెలిపింది. కాబట్టి ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సూచించింది. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అన్ని ఈపీఎఫ్ ఖాతాలకు యుఎఎన్ ను పొందాలని ఇపీఎఫ్ కంపెనీ యాజమానులను లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల మేరకు ఆధార్ కార్డు అనుసంధానానికి కావలసిన పత్రాలను సంస్థలకు ఇవ్వాలి. తప్పక చదవండి: How to check PF Balance || యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా... ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా ఉద్యోగులు తమ ఆధార్ కార్డును యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్) కు లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఈ లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో దీనిని లింక్ చేసుకునే ప్రాసెస్ న...