EPFO UAN || EPFO link aadhaar || ఆధార్ లింక్ తో మారిన పిఎఫ్ రూల్స్ .. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఇపీఎఫ్ఓ) పీఎఫ్ ఖాతా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పులు జూన్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అన్ని ఈపీఎఫ్ఓ ఖాతా లకు ఆధార్ కార్డ్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సంస్థలకు ఆదేశాలను పంపించింది. ఆధార్ కార్డు తో అనుసంధానించండి ఖాతాలకు ఈసిఆర్ దాఖలు చేయలేరు కాబట్టి సంస్థ కాంట్రిబ్యూషన్ నిలిచిపోతుందని తెలిపింది. కాబట్టి ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని సూచించింది. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక అన్ని ఈపీఎఫ్ ఖాతాలకు యుఎఎన్ ను పొందాలని ఇపీఎఫ్ కంపెనీ యాజమానులను లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల మేరకు ఆధార్ కార్డు అనుసంధానానికి కావలసిన పత్రాలను సంస్థలకు ఇవ్వాలి.
తప్పక చదవండి: How to check PF Balance || యూఏఎన్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయండిలా...
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా ఉద్యోగులు తమ ఆధార్ కార్డును యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యుఎఎన్) కు లింక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఈ లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది.
ఈ నేపథ్యంలో దీనిని లింక్ చేసుకునే ప్రాసెస్ ను ఇక్కడ తెలుసుకోండి.
1. ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ ను సందర్శించండి.
అధికారిక పోర్టల్ లింక్: https://www.epfindia.gov.in/
2. రిజిస్టర్ చేసుకొని ఉన్నవారు యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అవ్వండి.
(ఇప్పటికే రిజిస్టర్ అవ్వని వారు సంబంధిత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి.)
3. మెసేజ్ సెక్షన్ లోని కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
4. తరువాతి పేజీ లో ఆధార్ కనిపిస్తుంది.
5. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
6. ఆధార్ కార్డు లో మీ పేరు ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి.
7. మీరు ఒకసారి ఫాన్ పూర్తిచేసి సేవ్ చేయాలి.
8. యుఎడిఎఐ మీ ఆధార్ ను ఎలివేట్ చేస్తుంది.
9. ఒకసారి కేవైసీ పూర్తయ్యాక మీ ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ను ఓపెన్ చేసి, ఎడమ వైపు ఉన్న ఈ-కేవైసీ ఆప్షన్ ను క్లిక్ చెయ్యండి.
10. ఇక్కడ యుఏఎన్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి, జనరేట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
11. సంబంధిత రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది, వచ్చినటువంటి ఓటిపి ఎంటర్ చేసి, జెండర్ ను సెలెక్ట్ చేసుకొని, ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, ఆధార్ వెరిఫికేషన్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.
12. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్ లేదా ఈ-మెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
13. వెరిఫికేషన్ కోసం మరొకసారి ఓటిపి వస్తుంది, ఓటిపి ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
14. దీనితో ఈపీఎఫ్, యుఏఎన్ ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తవుతుంది.
అధికారిక ఈపిఎఫ్ఓ పోర్టల్ లింక్: https://www.epfindia.gov.in/
అధికారిక యుఏఎన్ పోర్టల్ లింక్: https://unifiedportal-mem.epfindia.gov.in/
Comments
Post a Comment