APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాత పరీక్ష ఆధారంగా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రతి నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ వివరాలను అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని తనిఖీ చేయవచ్చు. వివిధ విభాగాల్లో మొత్తం 3,673 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 3,673.