YUVIKA - YUva VIgyani KAryakram | Young Scientiest Programme - 2022 | Online Registration Process @eLearningBADI.in
9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుభవార్త! యువ సైంటిస్టులను తయారు చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) YUVIKA-2022, యువ విజ్ఞాన కార్యక్రమం (యువ సైంటిస్ట్ ప్రోగ్రాం) శిక్షణకు అకౌంట్ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రకటనను విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి భావి శాస్త్రవేత్తలు గా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తూ, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గా శిక్షణలు అందించడానికి, యువ విజ్ఞాన కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ శిక్షణ లకు, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో నుండి 150 మంది, విద్యార్థులను ఎంపిక చేసి, వేసవి సెలవుల్లో రెండు వారాల పాటు రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ను నిర్వహిస్తారు, షెడ్యూల్లో ఆహ్వానించ బడిన చర్చలు, ప్రముఖ శాస్త్రవేత్తలు అనుభవాన్ని పంచుకోవడం, ప్రయోగాత్మక మరియు ల్యాబ్ సందర్శనలు, నిపుణులతో ప్రాక్టికల్, ఫీడ్బ్యాక్ సెషన్.. మొదలగు విశేషాలు