TS POLYCET 2024 Results Out! Rank Card Download here..
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET-2024) ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.. 10వ తరగతి/ తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ (ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ మరియు అన్ని డిప్లొమా కోర్సుల్లో) ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష TS POLYCET 2024 ఫలితాలు ఇప్పుడే తాజాగా అందుబాటులోకి వచ్చాయి.. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. దీనిని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) తెలంగాణ, హైదరాబాద్ నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని ఎయిడెడ్ మరియు అన్-ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్/ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTSAU) , లో అందుబాటులో ఉన్న వ్యవసాయం, అగ్రికల్చర్, ఇంజినీరింగ్, సీడ్ టెక్నాలజీ & ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో డిప్లోమా మరియు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం హార్టికల్చర్ యూనివర్సిటీ (SKLTSHU) అందించే డిప్లొమా కోర్సుల్లో మరియు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటి (PVNRTVU) లో ప్రవేశం పొందవచ్చు.. Follow U