Graduation Apprentice 2021 || Arts, Science, Camars, may also Eligible || How to apply, Benefits more Details Check here..
డిగ్రీ విధ్యార్థులకు అప్రెంటిషిప్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వారికి.. ఈ ఏడాది నుంచి అమలు... పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పని అనుభవంతోపాటు స్టయిపెండ్ పోందే అప్రెంటిషిప్ అవకాశాన్ని ఈ సంవత్సరం నుంచి డిగ్రీ (ఆర్ట్స్, సైన్స్, కామర్స్) విద్యార్థులకూ కల్పించనున్నారు. ఇప్పటివరకు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకే ఈ అవకాశం ఉండేది. దానిని డిగ్రీ విద్యార్థులకు విస్తరిస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2025-26 వరకు అమల్లో ఉంటుంది. National Apprenticeship Training Scheme (NATS) నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) కింద ఈ శిక్షణ అందిస్తారు. దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్లలో మొత్తం 9 లక్షల మందికి అవకాశం ఇస్తారు. అందుకు రూ.3,054 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. సాంకేతిక విద్యతోపాటు సంప్రదాయ కోర్సుల విద్యార్థుల్లోనూ ఉద్యోగ నైపుణ్యాలను పెంచాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫారసు మేరకు ఈసారి పథకాన్ని డిగ్రీ విద్యార్థులకూవిస్తరించారు. Directorate General of Training ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్ధులకు విద్యలో భాగంగా అసలు ప్రాక్టికల్స్ చేయ