పోటీ పరీక్ష లేకుండా! రైల్వే లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి.. RRC NER Act Apprentice Notification for 1104 Vacancies..
మెట్రిక్యులేషన్/10 పాస్ తో ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త! రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్ఈఆర్), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1104 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న (భారతదేశంలోని అన్ని రాష్ట్ర/ కేంద్ర పాలిత) ప్రాంత భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు ఆన్లైన్ విధానం లో సమర్పించి, మెరిట్ ప్రకారం సీటు సాధించుకోవడానికి పోటీ పడవచ్చు.. ఈ అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్ -1, విభాగంలో (₹.18,000/- నుండి ₹.56,900/-) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే పలు నోటిఫికేషన్ లను వివిధ శాఖలు విడుదల చేసి ఉద్యోగ నియామకాలు జరిపాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో సంబంధిత విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20% వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 & అప్రెంటిషిప్ రూల్ 1962 ప్రకారం నోటిఫికేషన్ లోని 1104 సీట్లను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖా