School Education Department - Academic Calendar 2021-22 | for Classes I to X | Download here..
ఏప్రిల్లో టెన్త్ పరీక్షలు ఈ విద్యా సంవత్సరం లో మొత్తం 213 పనిదినాలు.. ఆకామిక్ క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ ఆన్లైన్ పనిదినాలు 47 + ప్రత్యక్ష బోధన 166 రెండు కలిపి 213 గా లెక్కించారు.. వచ్చే సంవత్సరం ఏప్రిల్ కల్లా పదవ తరగతి పరీక్షలు పూర్తి చేస్తామని విద్యా శాఖ తెలిపింది. ఈ విద్యా సంవత్సరం 2021-22 విద్యాశాఖ క్యాలెండర్ను ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం విడుదల చేశారు. ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 6 నుండి 17 వరకు దసరా, జనవరి 11 2016 వరకు సంక్రాంతి సెలవులు గా పేర్కొన్నారు. మిషనరీ స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 22 నుండి 28 వరకు క్రిస్మస్.సెలవులు క్యాలెండర్ లో తెలిపారు. పాఠశాలలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 23 వరకు మొత్తం 213 పని రోజులు (పాఠశాల పనిదినాలు గా) పనిచేస్తాయని వెల్లడించారు. 2022 జనవరి 1 నాటికి అన్ని తరగతుల సిలబస్ పూర్తి చేయనున్నట్లు ఆయన వివరించారు. పదో తరగతికి 2022 ఫిబ్రవరి 28 నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి, మార్చి, ఏప్రిల్ నెలలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల.. ప్రభుత్వం ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం 2021-22 విద