పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. మొదటి విడత, రెండవ విడత తేదీల వివరాలు..

పాలీసెట్ వెబ్ ఆప్షన్ ఆన్లైన్ షెడ్యూల్: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పదో తరగతి అర్హతతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య శాఖ కన్వీనర్ శ్రీ దేవసేన గారు తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థులు ఈనెల 24వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈసారి కొత్తగా 2 కళాశాలలు 1.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, 2. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు కళాశాలలో అందుబాటులోకి వచ్చాయి. వీటితో ప్రభుత్వం కళాశాలల సంఖ్య 57 నుండి 59 కు పెరిగింది. ఇదిలా ఉండగా ప్రైవేట్ కళాశాలలు రెండు తగ్గటంతో వాటి సంఖ్య 57 నుండి 55కు తగ్గింది. తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ : ఈనెల 24 నుండి 28 వరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్, ఫీజు చెల్లింపులు ఉంటుంది. 26 నుండి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన. 26 నుండి జూలై 1 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడం. జూలై 4న సీట్ల కేటాయింపు. 4 నుండి 6 వరకు, వెబ్ ఆప్షన్ ద్వారా ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ : ...