TSLPRB: ఎస్ఐ ఏఎస్ఐ తుది పరీక్ష ప్రాథమిక కీ విడుదల | Civil Constable Final Written Examination Preliminary Key Out! Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ నియామక బోర్డు, సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ, ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రాథమిక "కీ" తాజాగా అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల కోసం అందుబాటులోకి ఉంచింది. అభ్యర్థులు తాజా ప్రాథమిక కీ ఆధారంగా తమ స్కోర్ ను తనిఖీ చేయవచ్చు. సందేహాలు ఉన్న అభ్యర్థులు అభ్యంతరాలను సైతం ఈనెల 14వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకూ తెలుపవచ్చు. దానికి సంబంధించిన లింకు లను సైతం అధికారిక వెబ్సైట్లో పోలీస్ నియామక బోర్డు అందుబాటులోకి ఉంచింది. అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని తప్పనిసరిగా అటాచ్ చేయాలని పోలీస్ నియామక బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. TSLPRB తుది పరీక్ష ప్రాథమిక కీ డౌన్లోడ్ చేయడానికి మరియు అభ్యంతరాలను వ్యక్తపరచడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://www.tslprb.in/ తాజా Press Note చదవడానికి Latest News క్రింద కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి. తుది పరీక్ష ప్రాథమిక కీ మరియు అభ్యంతరాలను తెలపడం క