JEE Adv Results 2022 | ఆగస్టు 28న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదల..
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐ.ఐ.టి ల్లో ప్రవేశానికి, ఆగస్టు 28న నిర్వహించిన ఉమ్మడి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటి బాంబే ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ ఫలితాలతో పాటు త్రీ ఆన్సర్ 'కీ' ను కూడా విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపుగా 1.56 లక్షల మంది ఈ పరీక్ష కు హాజరైనారు. JEE Advanced 2022 పరీక్షకు మొత్తం 160038 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. అర్హత పరీక్షకు 155538 మంది హాజరైనార.. వీరిలో 40712 మంది అర్హత సాధించారు. ఈ అర్హత పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటి ల్లో ప్రవేశాలు పొందవచ్చు. TSNPDCL-ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగ ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ తనిఖీ చేయండిలా.. ఈ ఫలితాలలో RK శిశిర్ , మరియు తనిష్క కాబ్రా టాప్ ర్యాంకులో నిలిచారు. ◆ సిసిర్ మొత్తం 360 మార్కులకు 314 మార్కులు సాధించి టాప్ గా నిలిచాడు. ◆ తనిష్క 360 మార్కులకు 277 మార్కులు సాధించి టాప