JEE Adv Results 2022 | ఆగస్టు 28న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు విడుదల..
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐ.ఐ.టి ల్లో ప్రవేశానికి, ఆగస్టు 28న నిర్వహించిన ఉమ్మడి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలను ఐఐటి బాంబే ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ ఫలితాలతో పాటు త్రీ ఆన్సర్ 'కీ' ను కూడా విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హతతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు, అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపుగా 1.56 లక్షల మంది ఈ పరీక్ష కు హాజరైనారు.
JEE Advanced 2022 పరీక్షకు మొత్తం 160038 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా.. అర్హత పరీక్షకు 155538 మంది హాజరైనార.. వీరిలో 40712 మంది అర్హత సాధించారు.
ఈ అర్హత పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటి ల్లో ప్రవేశాలు పొందవచ్చు.
ఈ ఫలితాలలో RK శిశిర్, మరియు తనిష్క కాబ్రా టాప్ ర్యాంకులో నిలిచారు.
◆ సిసిర్ మొత్తం 360 మార్కులకు 314 మార్కులు సాధించి టాప్ గా నిలిచాడు.
◆ తనిష్క 360 మార్కులకు 277 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది.
ర్యాంక్ జాబితా ఇలా:
గణిత భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో విడివిడిగా పొందిన మార్కులు, మరియు మొత్తంగా పొందిన మార్కులను, పరిగణలోకి తీసుకొని జాబితాను విడుదల చేశారు.
JEE Adv Results 2022 డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ :: https://jeeadv.ac.in/
◆ Home పేజీలోని Announcements క్రింద కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి, ఫైనల్ కీ, ఫలితాలు డౌన్లోడ్ చేయవచ్చు.
◆ JEE Adv Results 2022 :: ఇక్కడ క్లిక్ చేయండి.







◆ JEE Advanced Master QPaper-1 2022 :: డౌన్లోడ్ చేయండి.
◆ JEE Advanced Master QPaper-2 2022 :: డౌన్లోడ్ చేయండి.
◆ JEE Advanced Final Answer Key 2022 :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment