TSSCBhavitha skill development free coaching for unemployees | SC Corporation development for unemployees | Check eligibility and Register here..
జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం. తేది.03-11-2021 నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోర్సుల యందు శిక్షణ పత్రిక ప్రకటన వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ, హైదరాబాదు వారి ఆదేశాల మేరకు జిల్లాలోని చదువుకున్న షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుంది.18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్న షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు వివిధ వృత్తి విద్య కోర్సులలో శిక్షణ కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, ఆదార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోట్ సైజ్ ఫోటో, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు మరియు విద్యార్హత ధృవీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 20వ తేది సాయంత్రం 5.00 గంటల లోపు ధరఖాస్తుల ను ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయం, జీవీ మాల్ ఎదురుగా , భద్రాద్రి కొత్తగూడెం నందు సమర్పించగలరు అని శ్రీ జి.ముత్యం, కార్యానిర్వాహక సంచాలకులు జిల్లా షెడూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లి., భద్రాద్రి కొత్తగూడెం వారు తెలియ జేస్తూ