తెలంగాణ: మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Telangana ESI Hospital Medical Staff Recruitment 2023 Apply here.
మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలివే.. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్ఐ హాస్పిటల్/ డిస్పెన్సరీల్లో, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ లతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా 28-08-2023 తేదీ వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం గౌరవ వేతనం మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 09 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 03, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ - 01, ఫార్మసిస్ట్ - 05. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్/బీడిఎస్/