APHC 3,673 Vacancies Recruitment 2022 | 7వ తరగతి అర్హతతో 3,673 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాత పరీక్ష ఆధారంగా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కూడా ప్రతి నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ వివరాలను అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని తనిఖీ చేయవచ్చు. వివిధ విభాగాల్లో మొత్తం 3,673 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి పిలుపునిచ్చింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 3,673.
జిల్లా కోర్టులు ఖాళీలు :: 3,432.
హైకోర్టులో ఖాళీలు :: 241.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ టైపిస్ట్ - 170,
◆ టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ (హై కోర్ట్) - 36,
◆ కాఫీయిస్ట్ - 209,
◆ డ్రైవర్ (లైట్ వెహికల్) - 20,
◆ డ్రైవర్ (హై కోర్ట్) - 8,
◆ ఎగ్జామినర్ - 112,
◆ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్స్ (హైకోర్టు) - 27,
◆ ఫీల్డ్ అసిస్టెంట్ - 158,
తప్పక చదవండి :: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ శాశ్వత టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇదే.
◆ జూనియర్ అసిస్టెంట్ - 681,
◆ ప్రాసెస్ సర్వర్ - 439,
◆ రికార్డు అసిస్టెంట్ - 09,
◆ ఆఫీస్ సబార్డినేట్ - 1520,
◆ ఆఫీస్ సబార్డినేట్ (హైకోర్టు) - 135,
◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III - 114,
◆ ఓవర్ సీర్ (హైకోర్టు) - 01,
◆ అసిస్టెంట్ ఓవర్ సీర్ (హై కోర్ట్) - 01,
◆ కంప్యూటర్ ఆపరేటర్ - (హైకోర్టు) 11,
◆ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (హైకోర్టు) - 13
◆ సెక్షన్ ఆఫీసర్/ కోర్ట్ ఆఫీసర్/ సెక్యూరిటీ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ (హై కోర్ట్) - 09..
తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో డ్రైవింగ్ లైసెన్స్, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం, టైపింగ్ పరిజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం.. కలిగి ఉండాలి.
పోస్టుల వారీగా విద్య అర్హత వివరాలు:
◆ టైపిస్ట్ పోస్టులకు : గ్రాడ్యుయేషన్ తో ఇంగ్లీష్ టైపింగ్ పరిజ్ఞానం, మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి.
◆ కాపీయిస్ పోస్టులకు : ఇంటర్ అర్హతతో టైపింగ్ పరిజ్ఞానం మరియు ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి.
◆ డ్రైవర్ పోస్టులకు : 7వ తరగతి లేదా తత్సమాన అర్హత తో లైక్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
◆ ఎగ్జామినర్ పోస్టులకు : ఇంటర్మీడియట్ అర్హతతో ప్రాంతీయ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.
◆ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు : బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి.
తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.పూర్తి వివరాలు..
◆ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు : బ్యాచిలర్ డిగ్రీతో ప్రాంతీయబాష పరిజ్ఞానం అవసరం.
◆ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు : 10వతరగతి తో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం ఉండాలి.
◆ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు : ఇంటర్మీడియట్ అర్హతతో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం.
◆ సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు : 7వ తరగతి త) తత్సమాన అర్హత తో ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలి. (ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు)
◆ స్టెనియో గ్రాఫర్ గ్రేడ్-3 పోస్టులకు : గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇంగ్లీష్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం: ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.23,780/- - రూ.1,07,210/- అన్ని అలవెన్సులు కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.800/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు రూ.400/-.
అధికారిక వెబ్సైట్ :: https://hc.ap.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.11.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment