నిరుద్యోగులకు శుభవార్త! 249 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF - 249 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పోస్టులను స్పోర్ట్స్ కోటా క్రింద భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ నెల 31 వరకు (31.03.2022) దరఖాస్తులు చేయవచ్చు.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 241,
విభాగాలు: అథ్లెటిక్స్, బాక్సింగ్, బాస్కెట్బాల్, జిమ్నాస్టిక్, ఫుట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, జూడో, కబ్బడి, షూటింగ్, సిమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్, టైక్వాండో.. మొదలగునవి.
పురుషుల విభాగంలో ఖాళీలు: 181.
మహిళా విభాగంలో ఖాళీలు: 68.
అర్హత ప్రమాణాలు:
నోటిఫికేషన్ ప్రకారం అన్ని అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచాలి.
పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తో పాటు రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీయ స్థాయి గేమ్స్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లో పాల్గొని ఉండాలి. మరియు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: ఆగస్ట్ 1, 2021 నాటికి 18 నుండి 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ట్రయిల్ టెస్ట్, ప్రొఫెసీఎన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
జీతం: pay matrix level-4 ప్రకారం ₹.25,500 నుండి 81,100 వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సు లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్-లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: ₹.100.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు మహిళలకు దరఖాస్తు మినహాయించారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 31.03.2022.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://www.cisf.gov.in/
Comments
Post a Comment