Pan Aadhaar Link || పాన్ ఆధార్ లింక్ డెడ్లైన్ ఇదే.. క్షణాల్లో లింక్ చేయండిలా...
పాన్ కార్డ్ వినియోగదారులందరూ కచ్చితంగా పాను నెంబర్ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మీ పాన్ కార్డు చెల్లుబాటు ఆగిపోతుంది. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ మార్చి 31 ను చివరి గడువు గా ప్రకటించింది.
మీరు పాన్ కార్డును కలిగి ఉన్నారా? కలిగి ఉంటే మీరు కచ్చితంగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఆదాయ పన్ను శాఖ ప్రకటించిన గడువులోపు పాన్ నో ఆధార్ తో లింక్ చేసుకోకపోతే రూ.1000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే బ్యాంకు లు తమ కస్టమర్లకు తెలియజేశాయి.
జూన్ 1 నుండి ఆదాయ పన్ను శాఖ, మెరుగైన సేవలు అందించడానికి తనను తాను అప్డేట్ చేసుకుని, వినియోగదారులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండే యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ ను ప్రారంభించిన క్రమంలో 7 రోజుల పాటు అన్ని రకాల సేవలను నిలిపివేసింది.
ఇప్పుడు వినియోగదారులు కొత్త పోర్టల్ ను సందర్శించి, తెలుసుగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవచ్చు. పాన్ ఆధార్ లింక్ గడువు జూన్ 30తో ముగిస్తుంది. అంటే ఇప్పటివరకూ పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకునేవారు ఈ నెలలోనే తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మీ పాన్ కార్డ్ చెల్లుబాటు నిలిచిపోతుంది. ఈ కారణంగా మీరు మీ పాన్ కార్డును అవసరం ఉన్న చోట వినియోగించుకో లేరు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ముందే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి.
మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో క్షణాల్లో లింక్ చేసుకోవడానికి ఆదాయ పన్ను శాఖ 2 సులువైన ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
1. ఆన్లైన్లో మీరు పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్: https://www.incometaxindia.gov.in/ హోం పేజ్ లో క్రింద కనిపిస్తున్న టువంటి ఇంపార్టెంట్ లింక్స్ లోని పాన్-ఆధార్ లింకేజ్ హైపర్ లింక్ పై క్లిక్ చేయండి. పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుండి మీ పాన్ ఆధార్ కార్డు వివరాలను ఎంటర్ చేసి లింక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ సర్వీస్ మెయింటెనెన్స్ లో ఉన్నది.
2. ఆధార్ తో రిజిస్టర్ ఉన్న మొబైల్ నెంబర్ నుండి ఈ క్రింది విధంగా మెసేజ్లు పంపి కూడా లింక్ చేసుకోవచ్చు. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి, పాన్ నెంబర్ ఎంటర్ చేసి ఈ నెంబర్లకు (567678 లేదా 56161) మెసేజ్ పంపాలి.
ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్: https://www.incometaxindia.gov.in/
తప్పక చదవండి: SBI Alert || Dear SBI Customer account has been blocked due to KYC update || Get individual KYC update details here...
Comments
Post a Comment