Group-IV New Vacancies 2023 | గ్రూప్-4 లో 141 కొత్త పోస్టులు | Apply Online here..
![]() |
గ్రూప్-4 లో 141 కొత్త పోస్టులు | Apply Online here.. |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నియామకాలను వేగవంతం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2,391 ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు 27.01.2023 న ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.. సంబంధిత విధి విధానాలతో త్వరలో నియామక ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 8039 పోస్టులు కాగా.. నూట నలభై ఒక్క కొత్త పోస్టుల చేరికతో.. ఆ సంఖ్య 8,180 కు చేరుకుంది.
ఈ పెరిగిన 141 పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి అర్హులు. బీసీ గురుకుల లో జూనియర్ అసిస్టెంట్(బాయ్స్ మరియు గర్ల్స్) సంస్థల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ కోడ్ 11 గా ఉన్నటువంటి ఈ విభాగంలో 289 పోస్టులు ఉన్నాయి తాజాగా కలిగినటువంటి 141 పోస్టులతో ఆ సంఖ్య 430 కు చేరింది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30.01.2023 తో ముగియనుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించడమైనది.
అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి, 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.24,280/- నుండి రూ.72,850/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఇప్పటికే ప్రకటించిన గ్రూప్-4 అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తాజాగా కలిపిన 141 పోస్టుల ప్రెస్ నోట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.01.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment