TS TET 2022 Notification : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET నోటిఫికేషన్ యొక్క సమగ్ర సమాచారం, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, మరియు ఇతర సమాచారాన్ని ఇక్కడ తనిఖీ చేయండి.
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!.
దాదాపుగా 5సంవత్సరాల నుండి డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న "టీచర్ అర్హత పరీక్ష" TET నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
దరఖాస్తు ప్రక్రియ రేపటితో (26.03.2022)ప్రారంభం కానుంది.
రాష్ట్ర ఆవిర్భావం తరువాత సెట్ నిర్వహించడం ఇది మూడవసారి, గతంలో 2016 మే మరియు 2017 జూలైలో అర్హత పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
2015 డిసెంబర్ 23న టెట్ అర్హత పరీక్షకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 36 లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో నెంబర్ 8 ను 2022 లో విడుదల చేసింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(NCTE) మార్గదర్శకాల ప్రకారం ఈ మార్పులు చేశారు.
అవి; 1. 6 నుండి 10 తరగతులకు బోధించేందుకు బీఈడీ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు, దానికోసం టెట్ పేపర్-II మాత్రమే రాసేవారు... కానీ పైన అనుకున్న టువంటి NCTE మార్గదర్శకాల ప్రకారం 1 నుండి 5 తరగతులు బోధించేందుకు పేపర్ -I కూడా రాయవచ్చు.. కాకపోతే SGT లు గా నియామకం అయిన వారు రెండు సంవత్సరాల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయవలసి ఉంటుంది.
2. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రాన్ని ఇప్పటివరకూ గరిష్టంగా ఏడు సంవత్సరాల కాలపరిమితి ఉండేది, అందుకు భిన్నంగా ఒకసారి డేట్ లో అర్హత సాధిస్తే జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా చేయాలని NCTE రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయించింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఈ మార్పు వర్తిస్తుందని పేర్కొన్నారు.
జీవో నెంబర్ 36, 2015 ప్రకారం తెలంగాణ రాష్ట్ర టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వబడుతుందని నోటిఫికేషన్లో సూచించారు.
అర్హత ప్రమాణాలు: ప్రస్తుత గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి D.EI.ED/ D.Ed/ B.Ed & లాంగ్వేజ్ పండిట్ లేదా దానికి సమానమైన కోర్సుల్లో చివరి సంవత్సరంలో కొనసాగుతున్న అభ్యర్థులు కూడా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.
ఈ అర్హత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.
★ పేపర్-I: 1 నుండి 5 తరగతులు బోధించడానికి D.EI.ED/ D.Ed అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
★ పేపర్-II: 6 నుండి 8 తరగతులు బోధించడానికి B.Ed అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు.
★ 1 నుండి 8 తరగతులకు బోధించడానికి ఆసక్తి కలిగిన డీఎడ్ చేసిన అభ్యర్థులు పేపర్-I, పేపర్-II రెండింటికి దరఖాస్తులు చేయవచ్చు.
పరీక్ష సెంటర్లు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా ప్రధాన కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తులో భాగంగా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడానికి వీడియోను చూడండి.
దరఖాస్తు ఫీజు: ₹.300.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.03.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12.04.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
పేపర్-I సిలబస్: డౌన్లోడ్ చేయండి.
పేపర్-II సిలబస్: డౌన్లోడ్ చేయండి.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సమాచార బులెటిన్: డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://tstet.cgg.gov.in/
Comments
Post a Comment