ఇంటర్ పాస్ లకు రూ.24,000/- స్కాలర్షిప్: Santoor Scholarship for Womens Apply here..
సంతూర్ స్కాలర్షిప్ పథకం 2023-24:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని యువతుల కోసం సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాం విప్రో కేర్ మరియు విప్రో కన్జ్యూమర్ కేర్ & లైటింగ్ గ్రూప్ 2023-24 విద్యా సంవత్సరానికి 12వ తరగతి పూర్తి చేసుకుని తదుపరి విద్యా అవకాశాల కోసం ప్రవేశం పొందిన యువతులకు సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ గా అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఈ కార్యక్రమం 2016-17 నుండి ప్రారంభించబడింది.
- ఈ పథకం క్రింద అర్హులైన యువతులకు తమ డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి సంవత్సరానికి రూ.24,000/- స్కాలర్షిప్ రూపంలో అందిస్తుంది.
- గడిచిన ఏడు సంవత్సరాలుగా ఈ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటికి దాదాపుగా 6,000 మంది యువతులకు విద్యకు ఈ స్కాలర్షిప్ తోడ్పాటు అయ్యింది.
- అభ్యర్థి ప్రభుత్వం పాఠశాల నందు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అలాగే 12వ తరగతి కూడా ప్రభుత్వ పాఠశాల/ జూనియర్ కళాశాల నందు విద్యా సంవత్సరం 2022-23 లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- విద్యా సంవత్సరం 2023-24 కు గాను డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవడానికి ప్రవేశం పొంది ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక & చత్తీస్గడ్ రాష్ట్రాల నుండి ఆర్థికంగా వెనుకబడి ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆసక్తి కలిగిన యువతులకు మాత్రమే వర్తిస్తుంది.
తప్పక దరఖాస్తు చేయండి : ఇంటర్ పాస్ అయిన వారికి సం. రూ.లక్షన్నర స్కాలర్షిప్ ఇక్కడ దరఖాస్తు చేయండి.
📌 ఈ పథకం క్రింద సంవత్సరానికి 19,000 మంది యువతులకు కల్పిస్తారు.
- గ్రాడ్యుయేషన్ కోర్స్ వ్యవధి తప్పనిసరిగా 3 సంవత్సరాలు ఉండాలి.
- వృత్తి విద్య కోర్సులతోపాటు హిమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ మరియు సైన్స్ రంగాలలో ఉత్తమ విద్య నభ్యసించడానికి ప్రవేశం పొంది ఉన్న విద్యార్థినిలు తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ పథకం కోసం దరఖాస్తు చేయండి.
- ఈ స్కాలర్షిప్ పథకం కింద ఎంపికైన విద్యార్థినిలకు సంవత్సరానికి రూ.24,000/- కోర్సు పూర్తి అయ్యేంతవరకు చెల్లిస్తారు.
- ఈ మొత్తాన్ని అభ్యర్థి ట్యూషన్ ఫీజు లేదా విద్యకు సంబంధించిన ఇతర ఖర్చులకోసం ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తుదారు తప్పనిసరిగా..
- బ్యాంక్ పాస్ బుక్ ఫోటో కాపీ,
- ఇటీవల పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ,
- ఆధార్ కార్డు ఫోటో కాపీ,
- పదో తరగతి & 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కాపీలు అప్లోడ్ చేయాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.santoorscholarships.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :: 30.09.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment