Atomic Energy Central School-2 Hyderabad టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | జీతం ₹.26250 | పూర్తి వివరాలు మీకోసం..
హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ 2022-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన ను తాజాగా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల 26,250 రూపాయలు జీతం గా చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
◆ ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు విద్యార్హత ఎంపిక విధానం దరఖాస్తు విధానం మరియు జీతభత్యాల వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
◆ ట్రైని గ్రాడ్యుయేట్ టీచర్-TGTs :: ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్.. సబ్జెక్టులలో ఖాళీగా ఉన్నాయి..
◆ ప్రైమరీ టీచర్ PRTs :: లో కూడా ఖాళీలు ఉన్నాయి.
వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ లేదా వీడియో చూడండి.
★ విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీతో బీఈడీ అర్హత కలిగి ఉండాలి.
● AEES/ NVS/ KVS మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి రిటైర్ అయిన 65 సంవత్సరాల లోపు ఉపాధ్యాయులు కూడా దరఖాస్తులు చేయవచ్చు..
వయసు: ఏప్రిల్ 1 2022 నాటికి PRT లకు 40, TGT లకు 45 సంవత్సరాలకు మించకుడదు.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు.. గమనించండి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నది.
జీతం: TGT పోస్టులకు ఎంపికైన వారికి ₹.26,250/-
PRT పోస్టులకు ఎంపికైన వారికి ₹.21,250/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 28.05.2022.
అధికారిక వెబ్సైట్: http://www.aecshyd2.edu.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫారం: డౌన్లోడ్ చేయండి.
◆ ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ను పొందడానికి మా వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.
Comments
Post a Comment